![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -665 లో..... అప్పు బయటున్న పోలీస్ ల దగ్గరికి వెళ్లి రాజ్ గురించి అడుగుతుంది. మా అక్కని ఒక్కదాన్నే అడ్మిట్ చేశారు.. బావ ఎక్కడ అని అడుగుతుంది. మీరెవరు మేడమ్ మేమ్ ఇంట్రగేషన్ చేస్తున్నామని అతను అంటాడు. నేను పోలీస్ అంటూ తన ఐడి చూపిస్తుంది అప్పు. అక్కడ ఒక కావ్య గారు మాత్రమే ఉన్నారని అతను అంటాడు. ఇన్సిడెంట్ జరిగిన చోటుకి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని వాళ్ళతో చెప్తుంది అప్పు.
మరొక వైపు అపర్ణ వాళ్ళు బాధపడుతుంటే.. కావ్య ఒక్కతే ఉందంటే రాజ్ లేడేమోనని రుద్రాణి అంటుంటే. దాంతో అందరు తనపై విరుచుకుపడతారు. కావ్య అంతా గుర్తుచేసుకొని స్పృహలోకి వస్తుంది. డాక్టర్ అందరిని పిలుస్తాడు. ఆయన ఎక్కడ అంటూ కావ్య అడుగుతుంది. అసలేం జరిగింది నువ్వే చెప్పాలని ఇందిర దేవత అడుగుతుంది. ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటు వెళ్తున్నాం.. కార్ పంచర్ అయింది. తర్వాత లోయలో పడిపోయింది. నాకు స్పృహ లేదు.. ఇక ఏం జరిగిందోనని కావ్య చెప్తుంది. అప్పుడే అప్పు వస్తుంది. ఏమైంది రాజ్ ఆచూకి తెలిసిందా అని అపర్ణ అడుగుతుంది. అప్పు బాధగా అక్కడ బావ కన్పించలేదు.. అక్కడ బావ షర్ట్ మాత్రమే దొరికిందని అప్పు షర్ట్ ఇస్తుంది. అది మా ఆయన షర్ట్ అని కావ్య ఏడుస్తుంది. ఏదైనా దాస్తున్నావా అని అపర్ణ అనగానే.. బావ బాడీని అడవి జంతువులు లాక్కొని పోయి ఉంటాయని అంటున్నారని అప్పు అనగానే అందరు షాక్ అవుతారు. మా ఆయనకేం కాదు అంటూ కావ్య తట్టుకోలేకపోతుంది. మళ్ళీ స్పృహ కోల్పోతుంది.
మరొకవైపు యామిని తన పేరెంట్స్ రాజ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి టెన్షన్ పడుతుంటారు. అప్పడే రాజ్ స్పృహలోకి వస్తాడు. రాజ్ దగ్గరికి డాక్టర్ వెళ్తాడు. అసలు నాకు ఏమైందంటూ రాజ్ అడుగుతాడు. ఏం గుర్తు లేదా అని డాక్టర్ అడుగగా.. ఏం గుర్తు లేదని రాజ్ అంటాడు. మీ పేరు చెప్పండి అని డాక్టర్ అనగానే.. నాకు గుర్తు లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకి వచ్చి అతను గతం మర్చిపోయాడని యామిని వాళ్ళతో చెప్తాడు. నా రాజ్ నా కోసం మళ్ళీ పుట్టాడంటు యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య ఒకే హాస్పిటల్ అవడంతో యామిని వాళ్ల అమ్మ, కనకం పక్కపక్కన కూర్చొని ఉంటారు. కాబోయే అల్లుడికి ఆక్సిడెంట్ అయిందని, గతం మర్చిపోయాడని, ఇప్పుడు ఎలా పెళ్లి చేయాలని యామిని తల్లి కనకంతో అంటుంది. తనకే ఇచ్చి చెయ్యండని కనకం అంటుంది. మా అల్లుడు అక్కడ ఉన్నాడు.. చూద్దువు రండి అని కనకాన్ని ఆవిడ తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |